ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్లపైకి ఆవులు.. అనుకోకుండా ప్రమాదాలు! - kadapa lo padi avula mruthi

పాడి పశువులను యజమానులు ఇంటి సంపదగా, కన్న బిడ్డల్లా చూసుకునే వారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటికి ఇంత మేత వేసేవారు. వర్షాభావం, పశుగ్రాసం ధరలు పెరగడం వంటి ఇతర కారణాలతో పశుపోషణ యజమానులకు భారంగా మారింది. ఫలితంగా వాటిని రోడ్లపైకి వదిలేస్తున్నారు. చివరికి.. రహదారిపై తిరుగుతున్న పశువులు ప్రమాదవశాత్తు వాహనాల కిందపడి మృత్యువాత పడుతున్నాయి.

కడప జిల్లాలో పాడిఆవులు మృతి

By

Published : Oct 14, 2019, 10:58 AM IST

Updated : Oct 14, 2019, 12:49 PM IST

కడప జిల్లాలో పాడిఆవులు మృతి

కడప జిల్లా రాజంపేట పట్టణం మండలంలోని బోయినపల్లి జాతీయ రహదారిపై ఆవులు గుంపులుగా తిరుగుతూ...రోడ్లపై ఉన్న పచ్చిగడ్డి తింటూ అక్కడే నిద్రిస్తుంటాయి. వాటిని పోషకులు కన్న బిడ్డల్లా చూసుకునే వారు...వర్షాభావం, పశుగ్రాసం ధరలు పెరగడం వంటి ఇతర కారణాలతో పశుపోషణ యజమానులకు భారంగా అయ్యి...ఫలితంగా ఆవులను రోడ్లపైకి వదిలేస్తున్నారు. ఫలితంగా.. అవి ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. వాటిని ఢీకొని వాహనదారులూ ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు.

వాహనచోదకుల తిప్పలు:

పగలు, రాత్రనక ఆవులు జాతీయ రహదారిపై చేరుతున్న కారణంగా.. వాహనచోదకులు నానా తిప్పలు పడుతున్నారు. వీధి దీపాలు సరిగ్గా లేని ఇలాంటి మార్గాల్లో.. రాత్రి సమయాల్లో దగ్గరకు వచ్చేవరకు అక్కడ పశువులు ఉన్నాయి అనే విషయం వాహనచోదకులకు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పోలీసులు, పురపాలక అధికారులు, చర్యలు తీసుకుని పశువుల యజమానులతో మాట్లాడి వాటిని రోడ్లపైకి వదలకుండా చూడాలని... ఒకవేళ వారికి పశువులు భారమైతే గోశాలకైనా తరలించే ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

75 ఏళ్ల వయసులో 'అమ్మ' అయిన 'బామ్మ'!

Last Updated : Oct 14, 2019, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details