ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీపీపీ క్వార్టర్స్​లో చోరీ.. 20తులాల బంగారం, 40లక్షల నగదు అపహరణ - కడప ఆర్టీపీపీ తాజా వార్తలు

కడప జిల్లా యర్రగుంట్ల ఆర్టీపీపీ క్వార్టర్స్​లో చోరీ జరిగింది. ఆర్టీపీపీలో విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం.. దేవాలయానికి వెళ్లి.. తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగింది. 20తులాల బంగారం, 40లక్షల నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేశారు

theft at rtpp in kadapa district
ఆర్టీపీపీ క్వార్టర్స్​లో చోరి.. 20తులాల బంగారం, 40లక్షల నగదు అపహరణ

By

Published : Dec 25, 2020, 5:32 PM IST

కడప జిల్లా యర్రగుంట్ల ఆర్టీపీపీ క్వార్టర్స్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆర్టీపీపీలో విధులు నిర్వహిస్తున్న మిట్ట సుబ్రమణ్యం.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి.. ఇంటి తాళాలు పగలగొట్టిన ఉండటం గమనించిన సుబ్రహ్మణ్యం లోపలికి వెళ్లి చూశాడు. బీరువా తాళాలు పగలగొట్టి అందులోని.. 20తులాల బంగారం, 6కిలోల వెండి, రూ.40లక్షల నగదు అపరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details