ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా... వైకాపా సోషల్ మీడియా బృందం తిరుమలకు పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్రను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, చక్రాయపేట మండల వైకాపా ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి ప్రారంభించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సోషల్ మీడియా బృందం... ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు నాటికి తిరుమల చేరుకోనుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలు తిరుమల చేరుకొని స్వామిని దర్శించుకోనున్నారు.
తిరుమలకు వైకాపా సోషల్ మీడియా బృందం పాదయాత్ర - Kadapa District Idupulapaya News
ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా... ఎంపీ అవినాష్ రెడ్డి, వైకాపా సోషల్ మీడియా బృందం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. 21 నాటికి తిరుమలకు పాదయాత్రగా చేరుకుని వెంకన్నను దర్శించుకోనున్నారు.
తిరుమలకు వైకాపా సోషల్ మీడియా బృందం పాదయాత్ర