ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త అంత్యక్రియలు ముగిసిన కాసేపటికే.. ఆమె కూడా - Latest News Of Ap

Wife And Husband Sudden Death
కొన్ని గంటల వ్యవధిలో భార్యభర్తల మృతి

By

Published : Aug 30, 2022, 3:18 PM IST

Updated : Aug 30, 2022, 4:43 PM IST

15:15 August 30

అనారోగ్యంతో భర్త, గుండెపోటుతో భార్య.. కొన్ని గంటల వ్యవధిలోనే

Wife and Husband Sudden Death: వారిద్దరిదీ ఎంతో అన్యోన్యమైన దాంపత్యం.. ఒకరంటే మరొకరికి ఎనలేని ప్రేమ.. 33 ఏళ్లపాటు కష్టసుఖాలు కలిసి పంచుకున్నారు. వారిద్దరికీ అంత ప్రేమ ఉంది కాబట్టే భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య కూడా తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన కడప శివారులోని విశ్వనాథపురంలో జరిగింది. అనారోగ్యంతో భర్త ప్రభుదానం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వచ్చారు. అంతలోనే ప్రభుదానం భార్య స్వర్ణలతకు గుండెపోటు వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మరణించింది.

విశ్వనాథపురానికి చెందిన ప్రభుదానం క్రిస్టఫర్, స్వర్ణలతకు 33 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుదానం కడపలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సీనియర్ అసిస్టెంట్​గా పని చేస్తున్నాడు. స్వర్ణలత మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పని చేస్తుంది. కొద్ది రోజులుగా క్రిస్టఫర్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వచ్చారు. అంతలోనే స్వర్ణలత గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. తల్లిదండ్రులు కొన్ని గంటల వ్యవధిలోనే మరణించటంతో ఆ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Aug 30, 2022, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details