ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుడే పుట్టింది... కంప చెట్ల మధ్య శవమైంది! - కడప క్రైం వార్తలు

అప్పుడే పుట్టిన చిట్టి తల్లి.. తల్లి పొత్తిళ్లలో ఉంటూ.. తన చిన్ని కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడాల్సిన ఆ శిశువు... అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సింది పోయి.. కంప చెట్ల మధ్యలో శవమై తేలింది. అసలేం జరిగింది?

The unidentified persons left the baby girl in the Fence at Produttur in Kadapa District
The unidentified persons left the baby girl in the Fence at Produttur in Kadapa District

By

Published : May 27, 2020, 2:00 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు మిట్టమడి వీధిలో విషాదం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ పసి కందును గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్లలో వదిలి వెళ్లారు. శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తల్లి ఒడిలో ఉండాల్సిన బుజ్జాయిని ఇలా కంపచెట్లలో పడేయడానికి చేతులు ఎలా వచ్చాయంటూ విచారం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... శిశువును ఎవరు పడేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details