కడప జిల్లా బద్వేలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ, ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు.ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు చారవాణిలో మాట్లాడుతు రోడ్డు దాటుతుండగా కంటైనర్ వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు చిచెన్నూరు మండలం ఎస్టీ రామాపురం గ్రామానికి చెందిన ఉదయ్ గా పోలీసులు గుర్తించారు.ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ, ఓ వ్యక్తి మృతి - బద్వేలు
కడప జిల్లా బద్వేలులో ఫోన్ మాట్లాడుతూ, ప్రమాదానికి గురై ఓ ద్విచక్రవాహన దారుడు దుర్మరణం పాలైయ్యాడు.
కంటైనర్ను ఢీ కొని యువకుడు మృతి