Leaders of the kapu community were furious with Kodali Nani : కాపులను దూషించిన కొడాలి నాని పై కడప జిల్లా టీడీపీ నాయకులు, బలిజ(కాపు) సంఘం నాయకులు మండిపడ్డారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. గుట్కాలు తింటూ లారీ డ్రైవర్గా పనిచేస్తూ నందమూరి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చిన కొడాలి నాని..నందమూరి కుటుంబాన్ని దూషించడం దుర్మార్గమని వారు ఖండించారు. కొడాలి నానికి దమ్ము, ధైర్యం ఉంటే కడప జిల్లాకు రావాలని సవాల్ విసిరారు. కడప జిల్లా కాపులు అంటే ఏమిటో కొడాలి నానికి చూపిస్తామని హెచ్చరించారు. ఎక్కడో గదిలో కూర్చుని నలుగురిని చుట్టు పెట్టుకొని నోటికొచ్చినట్లు కాపులను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan Shoes Cost : పవన్ కల్యాణ్ 'బ్రో' షూస్ అంతా కాస్ట్లీనా!
కనీస అర్హత లేని వ్యక్తికి మంత్రి పదవి.. కడపలోని బలిజ సంఘ కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరి ప్రసాద్ కొడాలి నాని పై మండిపడ్డారు. బలిజలకు కూడా మంత్రి పదవులు కావాలని బలిజలను ఎగతాళి చేసి మాట్లాడడం కొడాలి నాని కి తగదని ఖండించారు. వైఎస్సార్ పార్టీలో ఉన్న బలిజలు తక్షణం రాజీనామా చేసి బయటికి రావాలని డిమాండ్ చేశారు. కనీస అర్హత లేని వ్యక్తి కూడా మంత్రి పదవి కావడం ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం మండిపడ్డారు. విశాఖపట్నం కాపులు కొడాలి నాని వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తున్నారో తెలియదు గానీ కడప జిల్లా కాపులు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారని చెప్పారు.
KVS Bhaskar: "అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి".. ఎన్‌వీఎస్ 01 ప్రాజెక్టు డైరెక్టర్ విజయగాథ