కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 6: 30 గంటలకు ప్రారంభమైంది. చిన్నమండెం, గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సంబెపల్లె రాయచోటి మండలాల్లో 64 సర్పంచ్ స్థానాలు, 429 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.
భారీ బందోబస్తు మధ్య మొదలైన రెండో విడత పోలింగ్ - kadapa district newsupdates
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో భారీ బందోబస్తు మధ్య రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు మధ్య ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధమై వస్తున్నారు.
భారీ బందోబస్తు మధ్య మొదలైన రెండో విడత పోలింగ్
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, మరో 900 మంది పోలీసుల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతోంది. అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు మధ్య ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధమై వస్తున్నారు.