కడప జిల్లా బద్వేలులోని రాచపూడి నాగభూషణం పీజీ కళాశాలలో జలశక్తి అభియాన్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన జిల్లా శాస్త్ర సమాచార అధికారి తారక ప్రసాద్ మాట్లాడుతూ... స్వచ్ఛభారత్లా... జల శక్తి అభియాన్ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు అన్నారు. ఇందులో విద్యార్థుల పాత్ర ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ వాన నీటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. మొక్కలను విరివిగా నాటాలని తెలిపారు. నీటి పొదుపు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల బృందం జానపద గేయాలతో విద్యార్థులను అలరించారు. అంతకు ముందు పట్టణంలో ఎన్సీసీసీ విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు.
"జలశక్తి అభియాన్"లో విద్యార్థుల పాత్ర కీలకం - "జలశక్తి అభియాన్‌లో " విద్యార్థుల పాత్ర చాలా ప్రాముఖ్యం
జల సంరక్షణ పనులు చేపట్టకపోతే జీవకోటి మనుగడకు ముప్పు ఉందని జిల్లా శాస్త్ర సమాచార అధికారి తారక ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 9 జిల్లాలు భూగర్భ జలాలు అడుగంటినట్లు తెలిపారు. ఇందులో కడప జిల్లా ఉండటం దురదృష్టకరమన్నారు.
"జలశక్తి అభియాన్‌లో " విద్యార్థుల పాత్ర చాలా ప్రాముఖ్యం
Last Updated : Aug 28, 2019, 11:48 PM IST