ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు - కడపలో రోడ్డు ప్రమాదం న్యూస్

ఎదురెదురుగా వస్తున్న మూడు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పరస్పరం ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా బద్వేలు మైదుకూరులోని 67వ జాతీయ రహదారిపై జరిగింది.

The road accident took place at Badvelu Maidukuru in Kadapa district
మూడు ద్విచక్ర వాహనాలు ఢీ... ఒకరు మృతి... ఇద్దరికి తీవ్ర గాయాలు

By

Published : Feb 10, 2021, 9:17 PM IST

కడప జిల్లా బద్వేలు మైదుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. దొడ్ల డైరీ వద్ద 67వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న మూడు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతుడు బి. కోడూరు మండలం బోడపాడుకు చెందిన పద్మనాభరెడ్డిగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details