ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి' - కేశినేని నాని తాజావార్తలు

ముఖ్యమంత్రి జగన్ సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెదేపా ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. చట్టాల పట్ల అవగాహన లేక పార్లమెంట్​లో మద్దతు తెలిపామని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు.

తెదేపా ఎంపీ కేశినేని నాని
తెదేపా ఎంపీ కేశినేని నాని

By

Published : Feb 17, 2020, 3:58 AM IST

వైసీపీపై తెదేపా ఎంపీ కేశినేని నాని విమర్శలు

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెదేపా ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. జగన్ తీర్మానానికి తెదేపా శాసనసభ్యులతో మద్దతు ప్రకటించే బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. అలా చేయించకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. చట్టాలను రద్దు చేయాలని కడప పాత కలెక్టరేట్ వద్ద 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ముస్లిం నాయకులను ఆయన పరామర్శించారు. వైకాపా మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడటం దారుణమన్నారు. చట్టాల పట్ల అవగాహన లేక పార్లమెంట్​లో మద్దతు తెలిపామని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్​లు దాఖలు చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details