ఈనెల 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. యాజమాన్యం కార్మిక సమస్యలపై స్పందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చామని అన్నారు. ఆర్టీసీలో అన్ని విభాగాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని ఖండించారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గతంలోనే కార్మిక సమస్యలపై విన్నవించామని పేర్కొన్నారు. ఎన్ఎంయు ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు. మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కార్మిక సమస్యలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.
ఈ నెల 8న ఆర్టీసీ సమ్మె సన్నాహక సభ - శ్రీనివాసరావు, ఎన్ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
కార్మిక సమస్యలపై యాజమాన్యం స్పందిచకపోవటంతో ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మెకు ఆర్టీసీ కార్మికసంఘాల సన్నద్ధమౌతున్నాయి. ఈ సందర్భంగా కార్మికులు కడపలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి యూనియన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
![ఈ నెల 8న ఆర్టీసీ సమ్మె సన్నాహక సభ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3451190-983-3451190-1559473716200.jpg)
ఈ నెల 8న ఆర్టీసీ సమ్మె సన్నాహక సభ