కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని బుడుగుంటపల్లిలో స్థానికులు దొంగ సారా తయారీకి మొగ్గు చూపుతున్నారిని వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పరివర్తన సదస్సును ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారందరిని ఉపాధి హామీ పథకంలో పనులకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నమని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా వారి కుటుంబంలోనివారికి ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ సహకరిస్తుందని అన్నారు. వారిలో మార్పు వచ్చే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. వారికి ఉపాధి హామీ పథకంలో పనికి పోయేందుకు జాబ్ కార్డులు పోలీసుల ఆధ్వర్యంలో ఇప్పించి వారిలో మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
'నాటు సారా వద్దు.. పని కల్పిస్తాం చేసుకోండి' - latest kadapa district news
కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని బుడుగుంటపల్లిలోని డిగ్రీ కాలేజ్ ఆవరణంలో స్థానిక పోలీసులు పరివర్తన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్, రాజంపేట డీఎస్పీ స్వామి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. బుడుగుంటపల్లిలోని గ్రామస్థులు ఎక్కువ సంఖ్యలో నాటుసారా తయారీకి మొగ్గుచూపుతున్నారని వారందరిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ప్రతి శుక్రవారం నాటుసారా, ఎర్రచందనం, మరే ఇతర సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే గ్రామాలను తెలుసుకుని ఆ గ్రామంలో ఇటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు నాటుసారా తయారు చేయకుండా.. ఇతరత్రా సంఘ విద్రోహ చర్యలకు పోకుండా చేసేందుకు ఇటువంటి పరివర్తన సదస్సులు కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బుడుగుంట పల్లి గ్రామ ప్రజలు రైల్వేకోడూరు నియోజకవర్గ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇది చదవండి'వైకాపా నాయకులకు ఇసుక ఆహారంగా మారింది'