ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆన్లైన్ బెట్టింగ్​కు అలవాటు పడి.. బ్యాంకుకి కన్నం వేసిన దొంగ అరెస్ట్ - ఏపీ క్రైమ్ న్యూస్

Thief Arrest: ఆన్లైన్ బెట్టింగ్​కు అలవాటు పడి ఓ యువకుడు 10 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పు తీర్చేందుకు బ్యాంక్​కే కన్నం వేసి అప్పు తీర్చాలని అనుకున్నాడు. ఏకంగా మూడు రోజులపాటు...ప్రతి రోజు రాత్రి బ్యాంక్ కు వెళ్లి మేనేజర్ వెనకాల కిటికీ ఊచలను బ్లేడ్ తో కోస్తూ వచ్చాడు. అలా దొంగలించిన సామాగ్రిని అమ్మే ప్రయత్నంలో పోలీసులకు దొరికిన ఘటన వైస్సార్ జిల్లా జమ్మలమడుగు లో జరిగింది.

Thief Arrest
దొంగ అరెస్ట్

By

Published : Jan 8, 2023, 1:11 PM IST

Thief Arrest: వైస్సార్ జిల్లా జమ్మలమడుగులోని కెనరా బ్యాంకులో ఈ నెల 2వ తేదీన దొంగతనం జరిగింది. బ్యాంకు మేనేజర్ గదికి వున్న కిటికీ గ్రిల్ తొలగించి, బ్యాంకు లో నుండి 2 కంప్యూటర్లు, ఒక స్కానర్, ఒక సీసీ టీవీ మానిటర్, క్యాష్ కౌంటింగ్ మిషన్ తదితర వస్తువులను బాల మురళి అనే యువకుడు ఎత్తు కెళ్లాడు. బ్యాంకు మేనేజర్ ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం జమ్మలమడుగు పట్టణ సీఐ సదాశివయ్య ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మైలవరం మండలం వేపరాలకు చెందిన వరద బాల మురళి అనే యువకుడిని అరెస్ట్ చేసి చోరీ అయిన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details