కడప నగరంలోని ఎస్ఎఫ్ఎస్ వీధిలో 14 మందుల దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ తెరిస్తేనే ప్రజలకు మందులు దొరకడం కష్టంగా ఉండేది. అలాంటిది కేవలం ఒక రోజు ఏడు, ఇంకొకరోజు మరో ఏడు తెరవాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిమిత సంఖ్యలోని మందుల దుకాణాల వద్ద ప్రజలు మందుల కోసం బారులు తీరారు.
గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిలబడిన వ్యక్తి మందుల దుకాణం వద్దకు వెళ్ళిన తర్వాత ఆ మందులు లేవని చెబుతున్న కారణంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు సడలించాలని ప్రజలు కోరారు.