కడప జిల్లా కొండాపురం మండలంలో గండికోట జలాశయం నిర్మాణంతో మొత్తం 22 గ్రామాలు ముంపు జాబితాలో చేరాయి. గత ప్రభుత్వ హయాంలోనే మొదటి విడత కింద 14 గ్రామాలకు పరిహారం చెల్లించి ఖాళీ చేయించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక గండికోట జలాశయం నిర్వాసితులకు పరిహారం 10 లక్షల రూపాయలకు పెంచింది. మొదటగా కొండాపురంలో పెండింగ్లో ఉన్న వారికి పరిహారం పంపిణీ చేశారు. అనంతరం తాళ్ల పొద్దుటూరులో పరిహారం పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. తొలుత డబ్బులు చెల్లించిన నిర్వాసితుల ఇళ్లను కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలో నిర్వాసితులు తిరగబడ్డారు.
ఉన్నఫళంగా పరిహారం తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్లాలి అని ప్రశ్నించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నెలలుగా ధర్నాలు నిర్వహించారు. అయినా ప్రభుత్వం తీరు లో మార్పు రాలేదు. జలాశయంలో కొంచెం కొంచెంగా నీటి నిలువ పెంచుతూ వచ్చారు. నిర్వాసితులు తమ నిరసన విరమించిన కొద్ది రోజులకే జలాశయంలో 20 టీఎంసీలకు పైగా నిల్వ చేశారు. ప్రస్తుతం తాళ్లపొద్దుటూరులో దాదాపు ప్రతి ఇంట్లోకి వెనుక జలాలు చేరాయి. ఈనెల 11వ తేదీ నుంచి తాళ్ల పొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి గ్రామాలకు విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు. అప్పటి నుంచి గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నాయి.
విద్యుత్ సరఫరా నిలిపేశారు...