అడవుల్లో స్వేచ్ఛగా విహరించే నెమళ్లు గ్రామాల బాట పట్టాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా అటవీ ప్రాంతాల్లోని కుంటలు ఎండి పోవటంతో... అటవీ ప్రాంతాల్లోని జంతువులు, పక్షులు ఆహారం, తాగునీటి కోసం గ్రామాల వైపు అడుగులు వేస్తున్నాయి. కడప జిల్లాలోని ఆటవి ప్రాంతాం నుంచి నెమలి ఎర్రిపాపయగారి పల్లికి చేరింది. నెమలిని చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.
అడవి నుంచి గ్రామానికి చేరిన నెమలి
కడప జిల్లా నందలూరు మండలం ఎర్రిపాపయగారి పల్లి ప్రాంతానికి నెమలి వచ్చింది. అటు ఇటు ఎగురుతూ సందడి చేసింది. నెమలిని చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో క్లిక్ మనిపించారు.
అడవి నుంచి గ్రామానికి చేరిన నెమలి