కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతులుగా తమను విధులు నిర్వహించనీయకుండా ఈ ఏడాది జూన్ 12న దేవాదాయ ప్రత్యేక కమిషనర్, 13వ తేదీన సహాయ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టులో వాదనలు ముగిశాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ప్రకటించారు. బుధవారం విచారణలో దేవాదాయశాఖ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక కమిషనర్ పదవి విషయంలో స్పష్టత కోరుతూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశామని, ఆయన ఆకస్మికంగా బదిలీ కావడంతో వివరాలు ఇవ్వలేకపోతున్నామని, సమయం కావాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ఈలోపు వివరాల్ని కోర్టుముందు ఉంచవచ్చని ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టంచేశారు.
brahmamagari matham: మఠాధిపతి వివాదంపై వాదనలు పూర్తి..
కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి పదవిపై దాఖలైన వాయిజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
వీరబ్రహ్మేంద్రస్వామి మఠంపై విచారణ