కడప జిల్లా గాలివీడు మండలం ఎగువగొట్టివీడులో కుమార్తె మరణవార్త విని తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ఎగువగొట్టివీడుకు చెందిన మాజీ విఆర్వో సుభహాన్. కుమార్తె (30)కు రాయచోటి పట్టణం మాసాపేటలో వివాహం చేశారు. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉండగా ఇటీవల తల్లిగారింటికి వచ్చిందని బంధువులు పేర్కొన్నారు. ఆమె ఇంటి వద్ద ఉన్న పలంగా నేలకూలింది. వెంటనే ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమార్తె పరిస్థితి చూసిన ఆమె తండ్రి సుభహాన్(65) తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.
కుమార్తె మరణవార్త విని.. తండ్రి గుండెపోటుతో మృతి - kadapa district
కన్న కూతురు కళ్లెదుటే కింద వాలిపోయి స్పృహ తప్పడంతో తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తండ్రి బిడ్డను ఆసుపత్రి తరలించగా అప్పటికే కుమార్తె మృతి చెందారన్న విషయం వైద్యులు తెలపడంతో చికిత్సపొందుతున్న తండ్రి కూడా తనువు చాలించిన సంఘటన కడప జిల్లా గాలివీడు మండలం ఎగువగొట్టివీడులో చోటు చేసుకుంది.

కుమార్తె మరణవార్త విని తండ్రి గుండెపోటుతో మృతి
గాలివీడులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. రాయచోటకి వెళ్ళిన కుమార్తె గుండెపోటుతో మరణించిన సమాచారం తండ్రికి చేరింది. మరుక్షణమే ఆసుపత్రిలో ఆయన కూడా తీవ్ర గుండెపోటుతో మృతి చెందాడని బంధువులు పేర్కొన్నారు. గ్రామంలో తండ్రీకుమార్తెల మరణ వార్త దావానంలా విస్తరించింది. మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చదవండివివేకా హత్యకేసు: సిట్ నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ