ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరాడంబరంగా కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు

ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ ఏడాది కరోనా కారణంగా సాదాసీదాగా నిర్వహిస్తున్నారు . ఉరుసులో భాగంగా పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరిఫుల్లా హుసేని గంధం సమర్పించారు.

By

Published : Dec 29, 2020, 7:28 PM IST

kadapa dargah
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు

కడపలోని ప్రముఖ పెద్ద దర్గా ( అమీన్​ పీర్ దర్గా ) ఉరుసు ఉత్సవాలను ఈ ఏడాది కరోనా కారణంగా సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. ఈరోజు రాత్రి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా.. దర్గాను దర్శించుకొనున్నారు. ఉరుసులో భాగంగా నిన్న రాత్రి పీఠాధిపతి హజరత్ సయ్యద్ షా అరిఫుల్లా హుసేని గంధం సమర్పించారు. ఫకీర్ల విన్యాసంతో పాటు బ్యాండ్ మేళాలతో గంధం కార్యక్రమం కొనసాగింది. కొవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పీఠాధిపతి గంధం సమర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలో భక్తులందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ... స్వామివారిని దర్శించుకున్నారు.

కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details