కడప డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. డిసెంబర్ 6 నుంచి టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు బ్లెసీ రూరల్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు పుల్లగూర శ్రీనివాసులు వెల్లడించారు. ఈ పోటీల్లో అన్‌సీడెడ్ క్రీడాకారులు మాత్రమే పాల్గొనడానికి అర్హులని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛైర్మన్ జిలాని బాషా తెలిపారు.
మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను అందజేయనున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఈనెల 5వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అండర్-13, అండర్-15 విభాగాల్లో బాలురకు సింగిల్స్‌లో టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.