ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2020, 5:28 PM IST

ETV Bharat / state

సీఎం జగన్​ రైతు పక్షపాతి: ఉప ముఖ్యమంత్రి

ఈ నెల 18వ తేదీ నుంచి 40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేయనుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. పాత కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.

The deputy chief minister distibuted seeds
జీలుగులు పంపిణీ చేసిన ఉపముఖ్యమంత్రి

రైతుల పక్షపాతిగా... రైతు సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. పాత కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతులకు జీలుగలు పంపిణీ చేశారు.

ఖరీఫ్ సీజన్​లో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 50 శాతం సబ్సిడీతో జీలుగలు ఇస్తొందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details