ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 21, 2020, 5:17 PM IST

ETV Bharat / state

గుమ్మడి రైతులకు గడ్డుకాలం...

కరోనా ప్రభావం బూడిద గుమ్మడి రైతులపై తీవ్రంగా పడింది. కొంత కాలంగా వర్షాభావంతో.... ఉన్న కొద్దిపాటి నీటితో కడపజిల్లా రైల్వే కోడూరు రైతులు బూడిద గుమ్మడి పంటను వేశారు. లాక్‌డౌన్‌ కారణంగా మార్కెటింగ్ సౌకర్యం లేకుండా పోయింది. కొనుగోళ్లు లేక ఎగుమ‌తులు నిలిచిపోవ‌డంతో వారు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

pumpkin farmers
గుమ్మడి రైతులకు గడ్డుకాలం

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో పండించే బూడిద గుమ్మడి కాయ ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, నాగపూర్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. తమిళనాడులో అయితే అమావాస్య, సూర్య గ్రహణం, చంద్రగ్రహణం రోజున దిష్టి తీయడానికి ఎక్కువగా బూడిదగుమ్మడి కాయలు ఉపయోగిస్తారు. కరోనా మహమ్మారి వల్ల మద్రాస్ పట్టణమంతా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో రైల్వే కోడూరు నుంచి బూడిదగుమ్మడి కాయలు ఎగుమతి కాలేదు. మద్రాసులోని కోయంబేడు మార్కెట్ కరోనాకు కేంద్ర బిందువుగా మారటంతో....ప్రభుత్వం మార్కెట్​ను మూసివేశారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే లారీ డ్రైవర్ల వల్ల మన రాష్ట్రంలో ఎక్కువ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో లారీ డ్రైవర్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మెుగ్గు చూపటం లేదు. దీంతో కొనుగోళ్లు లేక రవాణా సౌకర్యం నిలిచిపోవటంతో.. బూడిద గుమ్మడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

అంతేకాకుండా తెలుగు సాంప్రదాయంలో జరిగే శుభకార్యాల్లో గుమ్మడికాయలు ఉపయోగిస్తారు. కిలో పది రూపాయలతో కరోనా రాక మునుపు అడిగిన వ్యాపారులు... ఇప్పుడు పూర్తిగా రాకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలి వేయవలసి వస్తున్నదని రైతులు తెలిపారు. కిలో పది రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తే... ఎకరాకు రెండు లక్షలకు పైగా వచ్చేదని....ఇప్పుడు వ్యాపారులు రాకపోవడంతో పంటంతా పొలాల్లోనే కుల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ఇవీ చదవండి:యోగాతో కరోనాను జయించవచ్చు: యోగా నిపుణులు

ABOUT THE AUTHOR

...view details