కడప జిల్లా కమలాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కరోనా బాధితుల కోసం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావటంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయవద్దని నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఘటనస్థలికి చేరుకున్న వైకాపా నాయుకులు ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని తెలపటంతో ఆందోళన విరమించారు.
క్వారంటైన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన - corona in kadapa
కరోనా బాధితుల కోసం క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ... కడప జిల్లా కమలాపురంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్యలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదన్నారు.
క్వారంటైన్‌కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన