ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

viveka murder case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీల్‌ యాదవ్‌ అరెస్ట్​ - వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

viveka murder case
సునీల్‌ యాదవ్‌

By

Published : Aug 3, 2021, 12:13 PM IST

Updated : Aug 3, 2021, 3:09 PM IST

12:09 August 03

వివేకా హత్యకేసులో 58వ రోజు సీబీఐ విచారణ

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం గోవాలో సునీల్ యాదవ్​ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ  ధ్రువీకరించింది. ఈరోజు ఉదయం సునీల్​ను గోవా స్థానిక కోర్టులో హజరుపరిచి సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్​లోకి తీసుకున్నారు. రేపు సునీల్ యాదవ్​ను కడప కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు.

సునీల్ యాదవ్​ను విచారిస్తున్న సీబీఐ  

కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి స్పెషల్ పార్టీ పోలీసులు చేరుకున్నారు. విచారణ సందర్భంగా భద్రతా బలగాలను కడప కేంద్ర కారాగారానికి  సీబీఐ రప్పించింది. సునీల్ యాదవ్​తో పాటు మరికొందరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి కడప జిల్లా పులివెందులలోని తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు.  

గతంలో హైకోర్టును అశ్రయించిన సునీల్ యాదవ్

   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తమను సీబీఐ వేధిస్తోందని కడప జిల్లా మోతునూతలపల్లికి చెందిన యదాతి సునీల్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం దిల్లీకి పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. అనుమతి లేకుండా లై డిటెక్టర్ వినియోగించారన్నారు. అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు.  

ఇదీ చదవండి

viveka murder case: వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ప్రశ్నిస్తున్న అధికారులు

VIVEKA MURDER CASE: ఇద్దరు అనుమానితుల విచారణ.. కీలక సమాచారం రాబట్టిన సీబీఐ?

Last Updated : Aug 3, 2021, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details