కడప జిల్లా పులివెందుల డంపింగ్ యార్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పులివెందుల వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో పులివెందుల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు లోయలో పడిపోగా అందులో ప్రయాణిస్తున్న వారు పరారయ్యారు.
రోడ్డు ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ మృతి - kadapa
కడప జిల్లా పులివెందులో ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు... హెడ్ కానిస్టేబుల్ మృతి