కడప జిల్లా పోరుమామిళ్ల ప్రభుత్వాస్పత్రిలోని లక్షలు విలువ చేసే మందులను కాల్చివేయడం సంచలనం సృష్టిస్తోంది. నాలుగేళ్లుగా మందులు గదుల్లోనే ఉండిపోయాయి. దీంతో అక్కడ పనిచేసే డాక్టరు ఒకరు మందులు అన్నింటిని బయటకు తీశారు. కాలం చెల్లిన కొన్ని మందులను కాల్చి వేయగా ఇంకొన్నింటిని పూడ్చి వేశారు.
దీని పై డాక్టర్ ప్రసన్న కుమార్ వివరణ కోరగా కాలంచెల్లిన వాటినే కాల్చి వేశామని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలిపామన్నారు.