ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిబ్యాలలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం - శిబ్యాలలో గుర్తు తెలియని మృతదేహం

కడప జిల్లా శిబ్యాలలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆత్మహత్యా? ఎవరైనా హత్య చేసి ఆ ప్రాంతంలో పడేశారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.

మృతదేహం లభ్యం
మృతదేహం లభ్యం

By

Published : Sep 15, 2020, 10:35 PM IST

కడప జిల్లా రాయచోటి సమీపం సుండుపల్లి మార్గంలో గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శిబ్యాల గ్రామం కంకరబండ వద్ద 45 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించి...రాయచోటి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా...పది రోజుల కిందట మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లి దుర్వాసన రావడం వల్ల ..సంఘటనా స్థలంలోనే మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించారు. మహిళ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా హత్య చేసి ఆ ప్రాంతంలో పడేశారా? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు పట్టణ సిఐ రాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'జీవో నెం.22ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details