YS Viveka Murder Case : తమ కంపెనీలన్నీ వై.ఎస్.వివేకానందరెడ్డి పేరిటే ఉన్నాయని, ఆ బోర్డుల్లో ఆయనే డైరెక్టర్‌గా కొనసాగారని వివేకానందరెడ్డి భార్య వై.ఎస్.సౌభాగ్యమ్మ సీబీఐకి తెలిపారు. ఏయే కంపెనీల్లో ఆయన వాటాదారుడిగా ఉన్నారో ఆ వివరాల్ని పొందుపరుస్తూ సీబీఐకి పత్రాలు సమర్పించారు. గతేడాది జూన్ 13, 24, ఆగస్టు 27 తేదీల్లో సీబీఐ అధికారుల ఎదుట ఆమె వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త కళ్లద్దాలు లేకుండా రాయలేరని తెలిపారు. వివేకా హత్యకు గురైన రోజు (2019 మార్చి 15న) ఆయన బెడ్‌రూమ్‌లో తీసిన వీడియో ఫుటేజిలో కనిపించిన కళ్లద్దాల కవర్లు రెండింటిలో ఒకటి పులివెందులలోని జ్యోతి ఆప్టికల్స్ వద్ద కొన్నట్లు తెలిపారు. తన భర్త వద్ద డ్రైవర్‌గా పనిచేసిన షేక్ దస్తగిరి (ఈ హత్య కేసులో నిందితుడు, తర్వాత అప్రూవర్‌గా మారారు) తరచూ ఆయన వద్ద చిన్న చిన్న మొత్తాల్లో అప్పులు తీసుకునేవాడని వై.ఎస్.సౌభాగ్యమ్మ సీబీఐకి చెప్పారు. ఆ సొమ్ము తిరిగి చెల్లించేవాడో లేదో తనకు తెలియదన్నారు. దస్తగిరి అతని సోదరి పెళ్లి కోసం అప్పు అడగ్గా.. 2018 డిసెంబరు 16న ప్రామిసరీ నోటు రాయించి రూ.95 వేలు ఇచ్చానని తెలిపారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని డ్రైవర్ ప్రసాద్ ద్వారా అడిగించినా అతను ఆ సొమ్ము ఇవ్వలేదన్నారు. తన భర్త వద్ద నుంచి దస్తగిరి రూ.50వేలు తీసుకుని సునీల్‌యాదవ్‌కు ఇచ్చాడనే విషయం తనకు తెలియదని చెప్పారు.
YS Viveka Murder Case : 'ఆయన తరచూ వివేకా నుంచి అప్పు తీసుకునేవాడు' - వివేకా హత్య కేసు వార్తలు
YS Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులకు వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది.తన భర్త వద్ద డ్రైవర్‌గా పనిచేసిన షేక్ దస్తగిరి తరచూ ఆయన వద్ద చిన్న చిన్న మొత్తాల్లో అప్పులు తీసుకునేవాడని వై.ఎస్.సౌభాగ్యమ్మ సీబీఐకి చెప్పారు.ఆ సొమ్ము తిరిగి చెల్లించేవాడో లేదో తనకు తెలియదన్నారు.
వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ
ఇదీ చదవండి: YS Viveka Murder Case: సీబీఐ వాంగ్మూలంలో వివేకా కుమార్తె సునీత కీలక వ్యాఖ్యలు