కడప జిల్లా ఎర్రగుంట్లలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ జేఏసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డగించడం సరికాదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ పట్ల విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్వహణ ఏపీజెన్కో ద్వారా చేపట్టాలని కోరారు. టెంట్లలో కాకుండా కింద కూర్చుని నిరసన తెలపాలని పోలీసులు చెప్పడంతో వాతావరణం సద్దుమణిగింది.
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత - RAYALASEEMA DHARMAL POWER PROJECT NEWS IN KADAPA DISTRICT
కడప జిల్లా ఎర్రగుంట్లలో ఆర్టీపీపీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే అడ్డగించటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
TAGGED:
RTPP NEWS IN KADAPA DISTRICT