కడప : ఆర్టీసీ బస్సు, లారీ ఢీ...పది మందికి గాయాలు - kadapa-district

12:36 January 22
లారీ ఢీకొని బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలు
కడప జిల్లా రాయచోటి-వేంపల్లి ప్రధాన మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చక్రాయపేట మండలంలోని పాయలోపల్లి ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.