గండికోట ప్రాజెక్టు జలాలు ఇళ్ల వద్దకు చేరుకోవటంతో.. కడప జిల్లా కొండాపురం ఈశ్వరమ్మ కాలనీలో పాముల సంచారం ఎక్కువైంది. ఈశ్వరమ్మ కాలనీలో ఉంటున్న కరుణాకర్ ఇంటివద్ద 10 అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది. పామును గుర్తించిన స్థానికులు.. దాన్ని హతమార్చారు. ఈశ్వరమ్మ కాలనీలో ఉండేది కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే. వీరి ఇళ్ల చుట్టూ గండికోట వెనుక జలాలు చేరటంతో.. నిత్యం పాములు వస్తున్నాయని వాపోయారు. అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదనీ.. ఈ విష సర్పాల వలన ఎవరికైనా హాని జరిగితే అధికారులే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
పది అడుగుల కొండ చిలువ హతం
కడప జిల్లా కొండాపురం ఈశ్వరమ్మ కాలనీలో పది అడుగుల కొండ చిలువ కలకలం రేపింది. భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు పామును హతమార్చారు.
కొండ చిలువ కలకలం