కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో రెండు వందల మందికి.. కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఒక్క రోజే 18 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, డీఎస్పీ నాగరాజు ఇతర అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
గ్రామమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇంకా సుమారు 100 మంది ఫలితాలు రావాల్సి ఉండగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతాయోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
నవాబుపేటలో విషాదం:
గ్రామంలో 18 మందికి కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి గుండె ఆగింది. పాజిటివ్ కేసులు వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు గ్రామానికి ఎక్కువ సంఖ్యలో అధికారులు రావడం, అంబులెన్స్‌లో వారిని తరలించడం చూసిన 64 సంవత్సరాల దేవదత్తం అనే వ్యక్తియయయ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటన.. నవాబుపేటలో మరింత విషాదాన్ని నింపింది.
ఇవీ చూడండి:
రాజంపేటలో 3 కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు