తిరుమల తిరుపతి తొలి గడప దేవుని కడపలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు రెండున్నర నెలల తర్వాత తెరుచుకున్నాయి. లాక్ డౌన్ దృష్ట్యా దాదాపు రెండున్నర నెలలపాటు ఆలయాలను మూసివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ.. ఆలయాలను పునఃప్రారంభించారు.
మొదటి రోజు కావటంతో ఆలయానికి భక్తుల తాకిడి అంతగా లేదు. స్వామి దర్శనానికి వచ్చే వారికి తీర్థ ప్రసాదాలు అందించబోమని దేవాలయ పాలకమండళ్లు స్పష్టం చేశాయి. భక్తులు నిబంధనలు పాటించాలని అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.