దసరా ఉత్సవాలకు కడప జిల్లాలో ఆలయాలు ముస్తాబవుతున్నాయి. జిల్లాలోని రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఈ నెల 17 నుంచి 25 వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు నిత్య పూజలు అభిషేకాలు ఉత్సవాలకు భక్తులను అనుమతిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
పూజా కార్యక్రమాలు...
ఉదయం అభిషేకాలు సాయంత్రం వేళ అమ్మవారి ప్రత్యేక అలంకరణ కుంకుమార్చన పూజలు ఉంటాయని ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారు రోజు నిత్య ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 17న భద్రకాళి దేవిగా, 18న గాయత్రి దేవి, 19న పార్వతి దేవి, 20న అన్నపూర్ణాదేవి, 21న సరస్వతీదేవి, 22న రాజరాజేశ్వరి దేవి, 23న మహాలక్ష్మి దేవి, 24న మహిషాసురమర్దిని, 25న విజయ లక్ష్మి దేవి అమ్మవారు అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.