కడప జిల్లా పులివెందులు మండలం కేంద్రంలోని కోతి సమాధి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. తెలుగు ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.
ఉపాధ్యాయురాలి ప్రాణం తీసిన కుక్క! - kothi samadhi road accident recent news
కడప జిల్లా పులివెందుల మండల కేంద్రంలోని కోతి సమాధి వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం
కడప జిల్లా లింగాల జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు.. పులివెందుల నుంచి స్కూల్‌కి ఆటోలో బయలుదేరారు. కోతి సమాధి వద్దకు రాగానే.. వీరు ప్రయాణిస్తున్న ఆటోకి కుక్క అడ్డుపడటంతో తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న తెలుగు ఉపాధ్యాయురాలు వసంత కుమారి మృతి చెందగా.. మరో నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందులు ఏరియా ఆసుపత్రికి తరిలంచారు.
ఇదీ చదవండి:మత్తుకు బానిసైన కుమారుడిని హతమార్చిన తల్లి