ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనోళ్లు.. మళ్లీ సత్తా చాటారు! - telugu students ranks in jee advanced news

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. తెలుగు విద్యార్థి గంగుల భువన్ రెడ్డి జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఓబీసీ విభాగంలో ఎల్.జితేంద్ర, దివ్యాంగుల కేటగిరిలో కందుకూరి సునీల్ కుమార్ విశ్వేష్ మొదటి ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో కుమార్ సత్యం 22, కొత్తపల్లి నమిత 44వ ర్యాంకు సాధించారు.

jee advanced  2020
jee advanced 2020

By

Published : Oct 5, 2020, 8:42 PM IST

ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్​డ్​లో దేశవ్యాప్తంగా 43,204 మంది అర్హత సాధించారు. మహారాష్ట్రకు చెందిన చిరాగ్ ఫాలర్ 396 మార్కుల్లో 352 సాధించి.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. బాలికల విభాగంలో కనిష్క మిత్తల్ 315 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండున్నర లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ.. 1,50,838 మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్ డ్ రాశారు. అర్హత సాధించిన వారిలో అబ్బాయిలు 36,497, అమ్మాయిలు 6,707 మంది కాగా.. దివ్యాంగులు 436 ఉన్నారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 13,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు

తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా ప్రతిభను ప్రదర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్ రెడ్డి జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించటంతో.. దేశంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఎల్.జితేంద్ర జాతీయ స్థాయిలో 14వ ర్యాంకుతో ఓబీసీ విభాగంలో మొదటి స్థానం సాధించాడు. దివ్యాంగుల విభాగంలో కందుకూరి సునీల్ కుమార్ విశ్వేష్​కు మొదటి ర్యాంకు దక్కింది.

వందలోపు 15 మంది

కొత్తపల్లి నమిత జాతీయ స్థాయిలో 44వ ర్యాంకుతో.. ఐఐటీ మద్రాస్ జోన్ బాలికల విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు. కుమార్ సత్యం 22వ ర్యాంకు సాధించాడు. ఏలూరు విద్యార్థి కాపెల్లి యశ్వంత్ సాయి జాతీయస్థాయిలో 32వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో రెండో ర్యాంకును, విజయవాడ విద్యార్థి చిలుకూరి మణి ప్రణీత్ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకు, మంచిర్యాల విద్యార్థి అన్నం సాయివర్ధన్ జాతీయ స్థాయిలో 93, ఓబీసీ విభాగంలో 7వ ర్యాంకు సాధించాడు. తెలుగు విద్యార్థులు ఓపెన్ కేటగిరిలో వంద లోపు సుమారు 15 మంది.. 500 లోపు దాదాపు 60 మంది ర్యాంకులు సాధించినట్లు అంచనా.

ABOUT THE AUTHOR

...view details