అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న ప్రవాసాంధ్రుడు కరోనాతో మృతి చెందారు. కడప జిల్లా పుల్లంపేట మండలం పీవీజీ పల్లికి చెందిన ఎన్ఆర్సీ నాయుడు.. కొవిడ్ బారిన పడి చనిపోయినట్లు తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీశ్ తెలిపారు. ఎన్ఆర్సీ నాయుడు మృతిపట్ల తాజా అధ్యక్షుడు తాళ్లూరు జయశేఖర్, ఇతర ప్రముఖులు కోమటి జయరాం, గంగాధర్ సంతాపం వెలిబుచ్చారు. తానా కార్యక్రమాల్లో నాయుడు ముఖ్యపాత్ర పోషించారని, 2019 వాషింగ్టన్ డీసీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో స్పాన్సర్‌షిప్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించినట్లు వివరించారు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీకి విలువైన సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.
అమెరికాలో కరోనాతో ప్రవాసాంధ్రుడు మృతి - ఎన్ఆర్సీ నాయుడు మృతి
కరోనాతో ప్రవాసాంధ్రుడు ఎన్ఆర్సీ నాయుడు మృతి చెందారు. కడప జిల్లాకు చెందిన ఆయన.. కొవిడ్ బారిన పడి చనిపోయినట్లు తానా మాజీ అధ్యక్షుడు సతీశ్ తెలిపారు. నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
telugu nri nrc naidu
TAGGED:
telugu nri nrc naidu