రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎటువంటి కొత్త ఆయకట్టు లేదని చెబుతున్నారని... అలాంటప్పుడు ఆ ప్రాజెక్టు అవసరమేలేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. 34 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుంటున్నందున రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని గవినోళ్ల శ్రీనివాస్ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై నిపుణుల కమిటీని నియమించిన ఎన్జీటీ...తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా నది యాజమాన్య బోర్డులను తమ వాదనలు తెలియజేయాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.