ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నమయ్య జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ

కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయాన్ని విశ్రాంత మెకానికల్ ముఖ్య సలహాదారులు సత్యనారాయణ పరిశీలించారు. మరమ్మతుల తరువాత భద్రతను పరిశీలించేందుకు మంత్రుల బృందంతో కలిసి ఆయన అక్కడికి వెళ్లారు.

annamayya project visit by technical team
అన్నమయ్య జలాశయ పరిశీలన

By

Published : Jan 27, 2021, 5:47 PM IST

కడప జిల్లా రాజంపేట మండలం బాధనుగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయాన్ని నిపుణుల కమిటీ పరిశీలించింది. విశ్రాంత మెకానికల్ ముఖ్య సలహాదారులు సత్యనారాయణ.. జలాశయాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. ఇటీవల భారీ వర్షాలకు జలాశయం గేట్లు దెబ్బతినడంతో.. ప్రాజెక్టులోని నీరు పూర్తిగా ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రస్తుతం నీటిని నిల్వ చేశారు. జలాశయంలో గేట్ల పరిస్థితిని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్​ రెడ్డి లతో కలిసి ఆయన చూశారు.

జలాశయంలో మరమ్మతులతో పాటు ఇప్పుడున్న 2.24 టీఎంసీ సామర్థ్యాన్ని.. 10 టీఎంసీలకు పెంచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారని నేతలు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పుడు నిపుణుల కమిటీ వచ్చి పరిశీలించిందన్నారు. ఇదే ప్రాజెక్టుకు సామర్థ్యాన్ని పెంచడమా.. లేక మరోచోట కొత్త ప్రాజెక్టు నిర్మించడమా అనేది నిర్ణయించాల్సి ఉందని తెలిపారు. ఇదే జరిగితే రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీటితో పాటు.. రాయచోటి నియోజకవర్గానికి తాగునీటి సమస్య శాశ్వతంగా తీరిపోతుందని, రైతాంగం కష్టాలు తీరతాయని వారు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతాం: కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details