కడప జిల్లా ప్రొద్దుటూరులోని జీవనజ్యోతి పాఠశాలలో గణతంత్ర వేడుకలు జరిపేందుకు చిన్నారులతో వెట్టిచాకిరీ చేయించారు. జెండా వందనం చేసేందుకు కావాల్సిన ఇనుప పైపును నిలబెట్టేందుకు గుంతలను కూలీలకు బదులు విద్యార్థుల చేత తవ్వించారు. పలకా, బలపం పట్టి చక్కగా చదవాల్సిన చిట్టి చేతులు.. పలుగు, పార పట్టి గుంతను తవ్వాయి. ఆదివారం ఉదయం అక్కడ పాఠశాల నిర్వాహకులు జెండా ఆవిష్కరణ చేశారు. వేలకు వేలు రుసుములు తీసుకుంటూ విద్యార్థుల చేత పనులు చేయించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండు చేస్తున్నారు. అయితే పిల్లలతో తాము పనిచేయించలేదని పాఠశాల యాజమాన్యం చెబుతోంది.పాఠశాలలో విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించిన పాఠశాల యాజమాన్యంఇవీ చదవండి:'కన్నవారినే ఇంటి నుంచి గెంటేసిన సుపుత్రుడు..!'