ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిస్తే.. షోకాజ్​ నోటీసులిస్తారా..?' - ఉద్యోగ సంఘాల నేతలకు షోకాజ్ నోటీస్

Show cause Notices: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు తెలిపితే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తారా అని టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎన్నికల్లో పోటీ చేయకూడదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. షోకాజ్‌ నోటీసులు వెనక్కు తీసుకోకపోతే.. ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

APTF
టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి

By

Published : Mar 2, 2023, 10:31 PM IST

Government Show cause Notices to Leaders of Teachers Unions: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు పోటీ చేయకూడదా.. వారికి మద్దతు తెలపకూడదా.. మద్దతు తెలిపితే తప్పేమిటని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి అన్నారు. కానీ ప్రభుత్వం కేవలం ఏపీటీఎఫ్​తో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు షోకాజు నోటీసులు జారీ చేయడం అప్రజాస్వామికమని ఆయన ఖండించారు. జారీ చేసిన షోకాజ్ నోటీసులను తక్షణం రద్దు చేయాలని లేదంటే ఇవాళ జిల్లాలోని అన్ని విద్యాశాఖ కార్యాలయల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కడపలో ప్రెస్ క్లబ్​లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాయలసీమ పశ్చిమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి విద్యావంతుడైన మేధావికి.. మద్దతు తెలుపుతున్నామనే ఉద్దేశంతో.. ఎక్కడ ఓటమి పాలవుతామోనని.. అధికార పార్టీ నాయకులు అధికారులతో కుమ్మక్కై ఉపాధ్యాయ సంఘం నాయకులకు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన కూడదని షోకాజు నోటీసుల్లో పేర్కొనడం సమంజసం కాదని ఖండించారు.

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను.. అధికార పార్టీ వారు దక్కించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఆటవిక పాలనలో ఉన్నామా అని ఆయన ఎద్దేవా చేశారు. షోకాజు నోటీసులకు రాత పూర్వకంగా సమాధానం అడగకుండా.. స్వయంగా ఉపాధ్యాయులే.. జిల్లా విద్యా శాఖ కార్యాలయాలకు హాజరు కావాలని పేర్కొనడం దారుణమని ఖండించారు. ప్రభుత్వం తక్షణం షోకాజు నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు హృదయ రాజు, తిమ్మన్నలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలకు షోకాజ్ నోటీస్ జారీ చేయడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు పోటీచేయడం తప్పా..?

"ఈ రోజు పశ్చిమ రాయలసీమలో.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా ఓ ప్రపంచ స్థాయి మేధావి, ఆక్స్​ఫర్డ్​ యూనివర్సీటీలో ఉన్నత విద్య చదువుకొని.. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడకి వచ్చారు. హాస్పిటల్ పెట్టుకొని అందరికీ సేవ చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి మద్దతుగా నిలిచినందుకు షోకాజు నోటీసులు ఇచ్చారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఓటమి భయంతోనే ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ చర్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఉపాధ్యాయులు పోటీ చేయడం తప్పా?. ఉపాధ్యాయులు నామినేషన్లకు వెళ్లి సంతకాలు పెట్టడం తప్పా?. ఓట్లు అడగటం తప్పా?. మరి ఈ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం". - చిరంజీవి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details