విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు..తలకు గాయం - విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు
ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు డస్టర్‌తో కొట్టాడు. ఈ ఘటనలో విద్యార్థి తలకు గాయమైంది. టీచర్ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు..తలకు గాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4246201-thumbnail-3x2-student.jpg)
teacher-beat-student-with-duster-student-injured
కడప జిల్లా రైల్వేకోడూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న రాహుల్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు డస్టర్‌తో కొట్టాడు. దీంతో రాహుల్ తలకు గాయమై రక్తస్రావమైంది. పాఠశాల సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించకుండా ఇంటికి పంపడంతో.... తల్లిదండ్రులు, గ్రామస్థులు వారిని నిలదీశారు. ఇదేమని పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తే.... తమపైనే ఎదురు కేసు పెడతామని బెదిరించారని విద్యార్థి తల్లి వాపోయింది.
విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన ఉపాధ్యాయుడు
TAGGED:
కడప జిల్లా