ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలకు తన వంతుగా 25 బియ్యం బస్తాలను తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి వితరణ చేశారు. బియ్యం బస్తాలను దర్గా నిర్వాహకులకు ఆయన అందజేశారు. తొమ్మిదేళ్ల నుంచి ప్రతి ఏడాది ఉరుసు ఉత్సవాలకు బియ్యం బస్తాలను దానంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలకు 25 బస్తాల బియ్యం వితరణ - కడప జిల్లా తాజా వార్తలు
కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలకు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి 25 బియ్యం బస్తాలను వితరణ చేశారు. తన వంతుగా బియ్యం బస్తాలను ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
బియ్యం బస్తాల వితరణ
ఎంతో ప్రతిష్ట కలిగిన ఈ ఉత్సవానికి దేశవ్యాప్తంగా ఎంతో మంది వస్తుంటారని.. అలాంటి వారికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేసేందుకు తన వంతుగా బియ్యం బస్తాలను ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొని.. విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: జలాశయం నుంచి ఊటనీరు.. వణుకుతున్న ఇందుకూరు