ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కడప జిల్లాలో తెదేపా జెండాను రెపరెపలాడిస్తాం' - kadapa latest news

కడప జిల్లాలో తెదేపాను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పార్టీ కడప లోక్​సభ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ మల్లెల లింగారెడ్డి అన్నారు. త్వరలోనే బాబు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.

linga reddy
linga reddy

By

Published : Sep 28, 2020, 5:25 PM IST

క్లిష్ట పరిస్థితుల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తనపై నమ్మకంతో కడప లోక్ సభ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​గా పదవి ఇచ్చారని మల్లెల లింగారెడ్డి అన్నారు. పార్టీ అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా కడప జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషితో తిరిగి పార్టీని అధికారంలోకి నిలబెడతామని చెప్పారు. కడప పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​గా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా జిల్లా పార్టీ కార్యాలయాన్ని సోమవారం సందర్శించిన ఆయన... అక్కడ మీడియాతో మాట్లాడారు.

కడప జిల్లాలో త్వరలో బాబు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జిల్లాలోని ప్రతి ఒక్క తెదేపా కార్యకర్త ఇంటిని సందర్శించి వారి కష్టసుఖాలు తెలుకుంటాం. వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తాం. ఇప్పటికీ నీరు - చెట్టుకు సంబంధించిన బిల్లులను వైకాపా ప్రభుత్వం మంజూరు చేయకపోవడం దారుణం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.

- మల్లెల లింగారెడ్డి, కడప పార్లమెంట్ తెదేపా ఇన్​ఛార్జ్​

ABOUT THE AUTHOR

...view details