ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జయహో..! రాంభూపాల్ రెడ్డి ! బాణసంచా, పూలతో ఘనస్వాగతం పలికిన పులివెందుల వాసులు - ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

Bhumi Reddy Ramgopal Reddy : రాయలసీమ ప్రజలు విజ్ఞులు, పరిణతి చెందిన వారు అని టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ విజయానంతరం పులివెందుల వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జయహో రాం భూపాల్ రెడ్డి.. భూమిరెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 19, 2023, 10:36 PM IST

Bhumi Reddy Ramgopal Reddy : టీడీపీ పశ్చిమ రాయలసీమ అభ్యర్థిగా పోటీ చేసిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొంది పులివెందులకు వచ్చారు. ఆయన తన నివాసానికి ర్యాలీగా వెళ్తుండగా.. ర్యాలీ వద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కార్యకర్తలు అందరూ వచ్చి తమ ర్యాలీకి అనుమతించాలన్నారు. చివరికి పోలీసులను పక్కకు నెట్టి ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి, పటాకులు పేల్చి ఘన స్వాగతం పలికారు.

టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డికి ఘన స్వాగతం

వైఎస్సార్సీపీ అరాచకాలకు చెక్ పెట్టారు... భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికార పార్టీ.. అక్రమాలకు పాల్పడిందన్నారు. అరాచకం, దొంగ ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేశారని తెలిపారు. తొండూరు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను లేకుండా చేయాలనుకున్నారని, కానీ ఎన్నికల కమిషన్ చొరవ తీసుకొని మళ్లీ ఏజెంట్లను కూర్చోబెట్టారని చెప్పారు. లింగాల పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలను కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు చెడగొట్టే ప్రయత్నం చేశారని, ఏజెంట్ల ను కొట్టి అరాచకం సృష్టించి రిగ్గింగ్ కు పాల్పడ్డారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నాయకులు డబ్బులు పంచినా ప్రజలు, పట్టభద్రులు అంతా తమ వైపే ఉన్నారని అన్నారు.

రాయలసీమ ఓటర్లు విజ్ఞులు.. అధికార వైఎస్సార్సీపీ నాయకులు పంచిన రెండు లక్షల యాభై వేల రూపాయలను ఓటర్లు తిరిగి తనకు ఖర్చుల కోసం ఇచ్చారంటే... రాయలసీమ ప్రజలు ఎంత విజ్ఞులు, ఎంత పరిణతి చెందిన వారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పట్టభద్రులు, యువత, రైతులు.. అందరి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకవుతానని, శాసన మండలిలో ప్రజా సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ దే విజయం... 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తప్పక అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం వచ్చిన వెంటనే ప్రజల అందరికీ తామిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. తాను ఎవరో తెలియక పోయినా ఇతర జిల్లాల్లోని టీడీపీ కార్యకర్తలు.. తనను కుటుంబ సభ్యుడిలా భావించారని.. అందువల్లే ఈ విజయం సాధ్యమైందని కృతజ్ఙతలు తెలిపారు. పులివెందులలోని ముద్దనూరు రింగ్ రోడ్ నుంచి తన నివాసానికి ర్యాలీగా వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకున్నారని.., ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే.. యువత, ఉద్యోగులు, మేధావులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకు గల కారణాలను విశ్లేషించుకోవాలే తప్ప.. గెలిచిన తర్వాత కూడా డిక్లరేషన్ ఇవ్వక పోవడం, గెలిచి ఇంటికి వస్తుంటే అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం. - ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details