పులివెందులలో ఎస్సీ మహిళ నాగమ్మ హత్యాచార ఘటన వెనుక ఉన్న అసలు పెద్ద మనుషులెవరని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. అసలు దోషులను తప్పించటానికి కేసులో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. సొంత బాబాయి హత్య కేసునే నీరుగార్చాలని చూసిన సీఎం.... ఎస్సీ మహిళ కేసులో దోషులను ఎలా శిక్షిస్తారన్నారు.
బాబాయి హత్య కేసులో ముఖ్యమైన వ్యక్తిని కాపాడేందుకే దిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారని విమర్శించారు. సీఎం దిల్లీ పర్యటనపై ప్రజల్లో ఉన్న అనుమానాలు తీరాలంటే వివేకా హత్య కేసు వివరాలను హైకోర్టు బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.