విద్యుత్ చార్జీల పెంపునూ నిరసిస్తూ... కడప జిల్లాలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. రాజంపేటలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో భౌతికదూరం పాటిస్తూ... ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కరోనాను దృష్టిలో ఉంచుకొని పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
'ప్రజలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి' - కడప జిల్లాలో తెదేపా నేతలు నిరసన
లాక్డౌన్ సమయంలో పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలని కోరుతూ...తెదేపా నేతలు కడప జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించి.. ఈ మూడు నెలలు ప్రజలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'పెంచిన చార్జీలను తగ్గించి.. ప్రజలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి'
పెరిగిన కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలంటూ రైల్వేకోడూరు పట్టణంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.., కరెంట్ చార్జీలు పెంచడం దారుణమని నేతలు వ్యాఖ్యానించారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించి..ఈ మూడు నెలలు ప్రజలకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.