ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''ఎన్ని కేసులు పెట్టినా చివరి వరకూ తెదేపాలోనే ఉంటా'' - మైదుకూరు తెదేపా నేత వెంకట సుబ్బారెడ్డి అరెస్టు వార్తలు

ఎన్ని కేసులు పెట్టినా తెదేపాను వీడే ప్రసక్తే లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి చెప్పారు. నీటి విషయంలో సెప్టెంబరు 28న కడప జిల్లా దుంపలగట్టులో జరిగిన ఘర్షణ కేసులో ఆయన్ను మైదుకూరు కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా.. ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఎన్ని అక్రమకేసులు పెట్టినా చివరి వరకూ తెదేపాలోనే'

By

Published : Nov 8, 2019, 11:12 AM IST

Updated : Nov 8, 2019, 12:30 PM IST

'ఎన్ని అక్రమకేసులు పెట్టినా చివరి వరకూ తెదేపాలోనే'

కడప జిల్లా దుంపలగట్టులో ఘర్షణ కేసుకు సంబంధించి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డితో పాటు అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ప్రత్యర్థులు మరో ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వృథా నీటి విషయంలో సెప్టెంబరు 28న గ్రామంలో మహిళల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం... ఘర్షణకు దారితీయగా ఇరువర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని మైదుకూరు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండు విధించినట్లు పోలీసులు తెలిపారు. తన కుటుంబంపై అక్రమ కేసు బనాయించారంటూ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆవేదన చెందారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదని, ఎవరికీ తలవంచనంటూ స్పష్టం చేశారు.

Last Updated : Nov 8, 2019, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details