ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్ మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలి'

కొవిడ్​తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు నిరసన చేపట్టారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ.. కడప జిల్లా రాజంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా మృతుల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు డిమాండ్ చేశారు.

రాజంపేట తాహశీల్దార్ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన
రాజంపేట తాహశీల్దార్ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన

By

Published : Jun 16, 2021, 6:44 PM IST

కరోనా మృతుల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. తెదేపా నిరసన కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా రాజంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తహసీల్ధార్ రవిశంకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం పురపాలక మేనేజర్​కి వినతి పత్రం అందించారు.

తెదేపా హయాంలో చంద్రన్న బీమా ద్వారా... పేదలకు 10 లక్షల రూపాయల వరకు నష్ట పరిహారం వచ్చేదన్నారు. చంద్రన్న బీమాను ప్రభుత్వం రద్దు చేయడం కారణంగా ప్రస్తుతం కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు ఒక్కపైసా సాయం అందలేదన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ సర్కార్ ఒక్కో కుటుంబానికి 10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్​ అందక రాష్ట్రంలో అనేక మంది మృతి చెందారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం అందించాలన్నారు.

ఇవీ చదవండి: Road Accident: రెండు లారీలు ఢీ.. ఐదుగురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details